ఇప్పటికి ఐదో ఆరో సార్లు నాకు తెలిసి. మళ్ళీ మరోసారి. ఫోన్ వచ్చింది. చేసింది కళ్యాణి వాళ్ళ చిన్నమ్మాయి, నటరాజ్ సహచరి. ఫోనే కాదు నాటకాన్ని డైరెక్ట్ చేసిందీ తనేనని తనే చెప్పింది.
నేను నాటకాలు చదువుకుంటున్నప్పుడు మా పక్కనే పేద్ద అద్దం ముందు తొంభైతొమ్మిది శాతం కాటన్ శారీలు నట్వాంగానికి ఉరకలేస్తుంటే మద్యలో లింగు లిటుకు మంటూ నాట్యం నేర్చుకున్న ఒకే ఒక పుంలింగమే నటరాజ్.
ఫోన్ వస్తుంది- అన్నాడు రావుడు
ఎక్కడ్నుంచిరా - అన్నాన్నేను
ఏం లేదు.. మా పిల్ల్ల లు నీ ఆంటిగొని వేస్తున్నార్లే- చాలా ధీమాగా తాపీగా అన్నది వాడి గొంతు
(గొంతు మగవాడిదే అయినా ధీమా స్త్ర్రీ లింగమే కదా భాషలో)
అవునా.. చెప్పలేదేం అన్నాను- పేషంట్స్ పెంచుకునీ, పేటెంట్స్ ప్రకోపించుకునీ.
ప్రొడక్షన్ పిల్లల్దే... డైరెక్షన్ ఫ్యాకల్టీది- అన్నది వాడి గొంతు మళ్ళీ
అలా అనీఅనగానే 1996లోకి వెళ్ళాను. అప్పుడు కూడా అదే సంగతి.
ప్రొడక్షన్ పిల్లలది. డైరెక్షన్ ఫ్యాకల్గీది
వేదిక రవీంధ్ర భారతి.
అలెక్స్ హెలీ రాసిన రూట్స్‌ని రావుడు. aka పెద్ది రామారావు స్టేజికి అడాప్ట్ చేసేస్తే, రోషమాన్ సినిమాని (సౌదా సహాయంతో అనుకుంటా)భిక్షు నాటకం చేసేసాడు.
రూట్స్క్ కి డిఎస్ఎన్ దర్శకత్వం. రోషమాన్‌కి భిక్షు. అప్పుడు స్టేజి మీద నటించింది మా జూనియర్టే.
మా- అంటే నేనూ, పెద్ది..
వాడూ నేనూ సెంట్రల్ యూనివర్సిటి నాటకాల విభాగంలో 94-96 బ్యాచిమేట్స్మే కాదు. హాస్టల్-A లోని రూం నెంబర్108లో కొద్దినెలలు రూం మేట్స్‌మి కూడా. అదే 108లో MA పొలిటికల్ సైన్స్ వీరాస్వామి, MA తెలుగు జయరాజ్, కుమార్- మా నలుగురు 108లో బస. నిజానికి నేనే ఆ రూంలో x tra.
వీరాస్వామి నా కళ్ళ ముందే పీపుల్స్వార్ కాంటాక్ట్ల్ లోకి వెళ్లడమూ, కనిపించ కుండా పోవడమూ, ఆర్ ఎస్ యు స్టేట్ ప్రెసిడెంట్ అయిపోవడమూ, మంత్రాలయంలో కనుమరుగైపోవడమూ అలా అలా క్షణాల్లో జరిగిపోయాయి.
వీరాస్వామి గురించి చాలానే చెప్పాలి. కానీ వీరాకిది సందర్భం కాదు
బ్యాక్‌టు పెద్ది రామా రావు. బ్యాక్ బ్యాక్ టు రూట్స్ అండ్ రోషమాన్.
మా అయ్యవార్లు రూట్స్, రోషమాన్‌లను వేసిన తర్వాత నేను ఆంధ్రజ్యోతి సండేలో సమీక్ష రాసాను. రాసిన కాలానికి నేనింకా ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థినే. అయితే నా సమీఓలో తేల్చి పారేసిందేమిటంటే పిల్లలకన్నా అధ్వాన్నం ఫ్యాకల్టీ దర్శకత్వం అని. ఇక డిఎస్ఎన్కు కాలింది. రిజాయిండర్ రాసాడు. అచ్చయింది. నాకు ఓనమాలు కూడా రావని శాపనార్థాలు పెట్టాడు.అయినా కోపం కక్ష తగ్గలేదు డిఎస్ఎన్ కి నా పైన. నాకు హాల్టికెట్ ఇవ్వలేదు. నేను రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాల్సిందేనని ఫత్వా జారీ చేసాడు. అప్పటి విద్యార్థులందరూ కూడా భయపడో, ప్రలోభపడో, మరోటి ఆశించో నేను ఆచార్యుల వారికి క్షమాపణ చెప్పాఇల్సిందేనని ముక్త కంఠంతో నినదించారు. ఆ పెద్దల జాబితాలో పెద్ది కూడా వుండిపోయాడు. నేను అప్పట్లో కొంచెం... కాదు చాలానే ఎక్కువ తిన్నవాడినై... సారీ గీరీ జాంతానై అన్నాను. నాదేం పోయింది. హాల్టికెట్ రాలేదు. నేను ఫైనల్ సెమ్ రాయలేదు. ప్రాక్టికల్స్ లో కూడా ఆర్యభట్ట ఆవిష్కరణే. నా మాస్టర్స్ డిగ్రీ నా పట్టుదల వల్లా డిఎస్ఎన్ మూర్ఖత్వం వల్లా నా చేతికి అందకుండా యూనివర్సిటీలోనే పదిలంగా వుంది ఇప్పటికీ.
అదీ నాకు రాని నా నాటకం మాస్టర్స్ డిగ్రీ వెనుక వున్న " పిల్లల ప్రొడక్షన్.. ఫ్యాకల్టీ డైరెక్షన్" అన్న అంకం.
కమింగ్ బ్యాక్ టు ఆంటిగొని నాటక ప్రదర్శన.
భిక్షు తన రోషమాన్ నాటకం తర్వాత వేద్దామనకుని నన్ను అనువదించమని కోరితే పుట్టిందే ఆంటిగొని నాటకం.
అప్పటికే రాజీవ్, భార్గవ కలిసి మేక్బెత్ నాటకాన్ని బసవలింగయ్య(మాదారి మాదయ్య ఫేం) కోసం ఆఘమేఘాలమీద అనువదించారు. భార్గవ తన భాగం అనువాదం దాదాపు నా రూంలోనే కంప్లీట్ చేసాడు. నా రూం అంటే నేనూ, నా తొలి గర్ల్ఫ్రెండ్ వర్ధని గారూ వున్న ఇల్లని అర్థం.
(నన్ను నటకావతంశా అని ముద్దుగా పిలుచుకునే వర్థని గురించి మరెప్పుడైనా)
రాజీవ్-భార్గవ అనువదించిన మేక్ బెత్ లో నావి రెండు పాత్రలు. నిజానికి మూడు.
ఒకటి- క్లైమాక్స్ల్ లో బర్నాం ఫారెస్ట్ని జుఫ్ మని దుంకేసి వచ్చి పోరాడి అశువులు బాసే స్టివార్డ్ బాయ్ ని నేనే.
( నేను నటించిన తొలి నాటకంలోనూ, సినిమాలోనే నేను చనిపోతాను. నా సినిమా చావు గురించి మరెప్పుడైనా.)
రెండు- మేక్ బెత్ నాటకానికి సంగీత సమకారం
నాటకానికి సంగీతం బివి కారంత్ సన్ ఆఫ్ శివరాం కారంత్. ఏం పేర్లు అవి. వినడమే కానీ చూస్తామన్న ఆశ కూడా లేని అపురూపమైన పేర్లు.
బివి కారంత్ ఆ నాటక సంగీతానికి దిక్కూ, కిక్కూ.
దిక్కు- అంటే ఏంటో ఏ అకడమిక్ అడ్డగాడిదైనా చెప్పేస్తాడు. రాసేస్తాడు.
కిక్కు అంటే నాలాంటోడే చెప్పల్ల.
నాటక సంగీతంలో కారంత్ ఇంప్రొవైజ్ చేసినంతగా మరెవరూ కలలో కూడా ధైర్యం చేసి వుండరు.
కానీ మా రిహర్సల్ గదికి చేరుకునే మెట్లపైనో, అవి దాటుకుని వస్తే గిస్తే హార్మోనియం మెట్లపైనో పడిపోయేవాడు కారంత్ జీ.
మా సంగీతం క్లాసులకి 90 శాతం గైర్ హాజరీ కారంత్. ఆ పది శాతంలోనే విశ్వరూపం చూపించిందీ అదే కారంత్. అదీ కారంత్. అలాంటి నాటకానికి సంగీతానికి సహకారం అంటే మాటలా మరి. అదీ నేనంటే నాటకాలా మరి.ఆ నాటకానికి నేనూ భరద్వాజా సంగీత సహకారం అందించాం. నమ్మకపోతే మీ కర్మ. ది హిందూలో ఫోటో ఇంటర్వ్యూ కూడా వుంది ప్రొతిమా సాగర్ ది. చూసి తరించండి.
నాటక సంగీతంలో బివి కారంత్ దగ్గరి నుంచి నేను నేర్చుకున్న దానికన్నా దొంగిలించింది ఎక్కువ.
( ఆ దొంగతనాల గురించీ, భూమికలో నేను సంగీతం చేసి -పాటలు రాసిన ప్రదర్వనకు నోచుకోని (నేను నొచ్చుకున్న) నాలుగు నాటకాల గురించీ తర్వాత ఎప్పడైనా నొక్కుతాను మీట.)
మళ్లీ వెనక్కి వస్తే... వచ్చే లోపు మరో సంగతి...
భరద్వాజ అనగా భరూ- బివి కారంత్ సంగీతానికి సహాహాకారంలో నా సహచరుడూ, నా ఇమ్మీడియట్ సీనియర్ ఈడియట్. మృదంగ విద్వంసుడు. నాటకాల పిచ్చోడు. సుందరం బ్యాచ్. యూనివరసిటీలో నా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నన్ను నాటకాలు రాసిమ్మనీ, కనీసం అనువాదం చేసిమ్మనీ వేధించీ, వేధించీ నాచే ప్రియా ప్రియా చంపొద్దే- అనే పీటర్ షాఫర్- ఆంథోని షాఫర్( వీళ్ళు కవలలూ, నాటక రచయితలూ) రచనకి నా అనుసృ.న దగ్గరుండి రాయించి మరీ పట్టుకుపోయాడు(రు). రు- ఎందుకన్నానంటే... భరద్వాజ కన్నా ఆ పని ఎక్కువ చేసినవాడు హరిశ్చంద్ర. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్. హరికి నట గుల. భరుకు దర్శక గుల. నాదేమో రాత గుల. గులానందలహరి.
ప్రియా ప్రియా చంపొద్దే- నాటకం హరికి తెచ్చినంత పేరు బరుకు రాలేదు. ( లేదా తెచ్చుకున్న వారికి తెచ్చకున్నంత అన్న స్కాండినేవియన్ సామెత ప్రకారం). అదే నా బాధ కూడా. అవార్డులు అన్నీ ఇన్నీ కాదు హరికి. కానీ ఒక్కటీ చూపించన పుణ్యాన పోలేదు హరి. ఇక పాపం మాట సరేసరి.
(ప్రియా ప్రియా చంపొద్దే మరియు ఓల్డ్ మాంక్ రమ్ క్వార్టర్ అను చాప్టర్ ఇంకోసారి.)
ఇప్పటిదాకా వాయిదా వేసిన ప్రతి దానికీ నేను మూల్యం చెల్లిస్తానని భరోసా ఇచ్చేందుకు ఇక్కడ మరో వాయిదా కోరుతున్నాను. ఎందుకంటే ఇలా చెప్పి ఫాయిదా లేదు అవన్నీ)

No comments:
Post a Comment